నిజంగానే మీరు నిజాం పాలనను మొదలెట్టినట్లే ఉంది!!

నిజాము రాజ్యపు
అరాచకాలు
రజాకార్ల అత్యాచారాలు
భారతావనికి మానని గాయాలు
చరిత్ర పుటలనుండి
చించేద్దామని
చెరిపేద్దామని
లేని పొగడ్తలు అతికేస్తూ
గొప్పతనమంటూ అబద్దాలు పులిమేస్తూ
ప్రజలపై పట్టు కోసమని
పెడ దారులు పడుతూ
నీతిమాలిన రాజకీయనాయకులు
స్వలాభం కోసం
తాము ప్రత్యేకమని చూపడానికి
స్థానికత విషం వ్యాపింపచేయడానికి
విభిన్నత చాటుకోడానికి
మిడిసిపాటు నిలుపుకోడానికి
మనము మనుషులన్న మాట మరచిన
నిజాము పాలకుల
నిర్దాక్షిణ్యపు పాలనల
వారసులమని
మురిసిపోతున్నారు
మాన ప్రాణాలను
ఆడుకున్న తోడుకున్న రాక్షస నైజపు
నిజాము రజాకార్లు
మీకు మార్గ దర్శకులా?
కర్కశ కౄర పాలకులపై పొగడ్తలా?
ఇది చరిత్ర క్షమించని నేరం
ఎరుపెక్కని ఈ మౌనం చూస్తుంటే
మీ దొరతనం మా గొప్పగా సాగుతోంది
నిజంగానే మీరు నిజాం పాలనను మొదలెట్టినట్లే ఉంది

5 కామెంట్‌లు:

  1. ముస్లిం ఓట్ల కోసం ఇంతలా దిగజారిపోవాలా ?
    ఆత్మ గౌరవాన్ని చంపుకుని నిజాం ని పోగాడాలా ?
    రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే , ఆ రాష్ట్ర ప్రతినిది , అలాంటి వ్యక్తీ తన స్వార్ధం కోసం, తన ప్రజల బాధలని హేళన చేస్తూ , తనకి ఓట్లు వేసిన ప్రజలని కూడా దిగజార్చి నట్టే కదా . ఇప్పటకి తెలంగాణా లో కథలు కథలు గా చెప్పే రజాకార్ల ఆకృత్యాలు గాలి కథలు అయిపోయినట్టే కదా. ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడే కదా చంద్రబాబు ఇలా అయిపోయాడు , ఇప్పుడు వీళ్ళు కుడా అదే మాట్లాడి మిగతా ప్రజలని చులకనా చేయాలా ? హైదరాబాద్ లో నిజాం తన ఉంపుడుగత్తెల కొసమ్ , వాళ్ళ వర్గం కోసం కట్టించిన భవనాలు , రోడ్ లు అభివృద్ధి కోవలోకి వస్తాయా ? మరి మిగతా తెలంగాణా అంతా గాలికి వదిలేసి , నగ్నంగా బతుకమ్మ ని ఆడించి, మనుషుల ఆత్మా గౌరవాన్ని మంట గలిపి నందుకు ఎలా పొగడాలి ఈ బహు గొప్ప నిజాం ని ??
    ఎన్ని పుస్తకాలు లో చదివాం ఆ రజాకార్ల అకృత్యాలు , ఎన్ని పుస్తకాలలో చదివాం నిజాం హైదరాబాద్ అభివృద్ధి .
    ప్రజల పోరాటాన్ని నీ ఓట్లు కోసం చులకన చేసి నిజాం కనా గొప్ప రాజు అయిపో దొరా

    రిప్లయితొలగించండి
  2. కట్టాశేఖర్ రెడ్డి అనే ఒక పాత్రికేయుడు బ్లాగు లో నిజాం ను నెత్తికెత్తు కొంట్టూ రాశాడు. నిజాంవారు ఎన్నో ఆస్థులను తెలంగాణా ప్రజలకు ఇచ్చిపోయారట. అందువల్ల ఆయన గొప్పవారంటూ సిగ్గులేకుండా సెలవిచ్చారు. ఆయన చెప్పిన లాజిక్ మాతాత మూడొచిన్నపుడల్లా ఊరిమీద పడి రేపులు చేశాడు,కాని నాకు కొండంత ఆస్థి ఇచ్చాడు కనుక మా తాత చాలా మంచోడు అనిప్రచారం చేసినట్లుంది. నిజామ్ను ను పొగటటం,దానికి మిగతా మేధావులు తాళం వేయటం చూస్తూంటే తెలంగాణా వారికి అసలు కేరక్టర్ అనేది ఒకటి ఉందా? అని అనుమానం రాకతప్పదు. ఇలాగే కె.సి.ఆర్. & కో వారు నిజామును తలకెత్తు కొంటే త్వరలో దేశం అంతా కలసి తెలంగాణ వారి మీద పేడనీళ్ళు చల్లే రోజు ఎంతో దూరంలో లేదు. పక్క రాష్ట్రాల వారు నీచం గా చూస్తే అప్పుడు అర్థమౌతుంది వారికి వారి గొప్పతనం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున మేస్తాదా ?
      కెసిఆర్ ఒకటి చెప్తే, అతని భట్రాజులు ఇంకొకటి చెప్తారా ?
      అతని రాతలు చూసాను , నమస్తే తెలంగాణా లో .
      నిజాం చేసిన వెధవ పనులు చెప్పకుండా మళ్ళి అతని దొర లానే cbn ,ysr అంటూ ఏదేదో చెప్తున్నాడు . నిజాం బోలెడన్ని ఆస్తులు ఇచ్చాడంట అందుకని అతని కాళ్ళు మొక్కి ఆ నీళ్ళు మన నెత్తి మీద వేసుకోవాలి , మన ఆడాళ్ళను చెరిచిన పట్టించుకోకుండా . ఆ ఆస్తులు ఎక్కడివి , ఎన్ని వేల కోట్లు విదేశాలకి తరలించారో తెలియదా జనానికి ..
      ఆ నిజాం చేసిన అకృత్యాలు, నెట్ లో ఎక్కడైనా కనిపిస్తాయి . వికీ లో
      -------------------------------------------------------------
      నిజాం పాలనలో దురాగతాలు[మార్చు]
      నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.[4] చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడ, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు[5] ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.
      తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు.[6] నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ మూఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు.[7]
      చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నిలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు.[8] దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.

      తొలగించండి
    2. ఆంధ్రావాళ్లు ఇటువంటి వాటికి అభ్యంతరం చెపితే కుట్ర అనికొట్టిపారేస్తున్నారు. ఎమిటి వీళ్ల మీద ఆంధ్రులు చేసిన కుట్ర? ఈ తిక్క జవాబులు నేడు జాతీయస్థాయిలో పాత్రికేయులను ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు ఛీ కొట్టటం మొదలుపెట్టారు. వీరికి తురకల పాలనలో వందల సంవత్సరాల చరిత్ర లేకుండాపోయింది. ఇంకా ఆంధ్రావారి మీద పడి ఏడిస్తే వీళ్లకి చెప్పుకోవటానికి ఎమి ఉండదు. గోరెటి వెకన్న, గద్దర్ పాటలు తెలుగువారికి తప్పితే పక్క రాష్ట్రాల వారికి అర్థం కూడాకాదు. మహ రచయిత్రి జుపాక సుభద్ర తెలుగులో విరచించిన సాహిత్యం అన్య భాషలో తర్జుమా చేసి గొప్ప సాహిత్యం అని చెప్పుకోగలరా?

      తొలగించండి
  3. నేను ఆంధ్ర వాడినే అయినా, నాకు తెలంగాణా లో కొంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు , వాళ్ళెవరు నిజాం ని పొగిడేవారు కాదు , ఇంకా చెప్పాలంటే బూతులు తిట్టేవారు .
    వాళ్ళెవరు హైదరాబాద్ వాస్తవ్యులు కారు , బహుశా అందువల్లేమో వాళ్లకి నిజాం గొప్పతనం తెలియడం లేదు .

    రిప్లయితొలగించండి

Add your comment here